- వార్షికంగా 145 శాతం పెరుగుదల
- రూ.1.20 చొప్పున డివిడెండ్
హైదరాబాద్, వెలుగు: విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్నికరలాభం 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో 175 శాతం పెరిగి రూ.40 కోట్లకు చేరింది. గత ఏడాది నాలుగో క్వార్టర్‌లో నికర లాభం రూ.14.6 కోట్లుగా ఉంది. పన్నుకు ముందు లాభం రూ.20.3 కోట్ల నుంచి రూ.51.1 కోట్లకు పెరిగింది.
ఆదాయం 13 శాతం పెరిగి రూ.479.8 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.425.9 కోట్లుగా ఉంది. మూడో క్వార్టర్‌తో పోలిస్తే ఇది 31 శాతం పెరిగింది.
లాభం రూ.1.9 కోట్ల నుంచి రూ.40 కోట్లకు పెరిగింది. తమిళనాడు, గుజరాత్‌లలో ఉన్న భూమి, భవనాల విక్రయం ద్వారా రూ.23 కోట్ల అసాధారణ లాభాలు రావడం కంపెనీ లాభదాయకతకు తోడ్పడింది. 2026 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ఆదాయం 9 శాతం పెరిగి రూ.1,678 కోట్లకు చేరింది.
రూ.85.4 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3 కోట్ల నికర నష్టం వచ్చింది. బోర్డు డైరెక్టర్లు ప్రతి ఈక్విటీ షేరుపై రూ.1.20 తుది డివిడెండ్‌ను సిఫార్సు చేశారు.
